Monday, 21 December 2009
తెలంగాణలో అలజడి సృష్టించడానికే హైదరాబాద్
విజయవాడ ఎంపీ లగడపాటిరాజగోపాల్ తెలంగాణలో అలజడి సృష్టించడానికే హైదరాబాద్ కు వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో అల్లర్లు సృష్టించి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి రాజగోపాల్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ మరో అగ్నిగుండంలా మారకముందే ఆయనను ఆంధ్రప్రాంతానికి తరలించాలని వీహెచ్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఆంధ్రా నాయకుల ఎత్తులకు మోసపోయి తెలంగాణ ప్రజలు విద్యార్థులు హింసకు పాల్పడవద్దని ఆయన కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment